హార్పీ ఈగల్స్ అద్భుతమైన, శక్తివంతమైన పక్షులు! మనం ఈ యొక్క మనోహరమైన పక్షుల గురించి తెలుసుకుందాం.
హార్పీ ఈగల్స్ ని మొట్టమొదటగా కార్ల్ లిన్నేయస్ 1758 వ సంవత్సరంలో వల్చర్ హార్పిజాగా వర్ణించాడు, గ్రీకు పౌరాణిక లలో ఈ ఈగిల్ యొక్క శరీరం మరియు ముఖం మానవులని పోలి ఉంటుందని పేర్కొన్నాడు. వీటి యొక్క జీవితకాలం 25-35 సంవత్సరాలుగా ఉంటుంది.
ఇవ్వి ఎక్కువగా పెద్ద పెద్ద అడవులను ఇష్టపడతాయి. ఈ యొక్క పక్షులు ఎక్కువగా దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవులలో కలవు. ఈ జాతులు తక్కువ పరిధిలో మెక్సికో మరియు మధ్య అమెరికా ప్రాంతాలలో కూడా కనిపిస్తాయి.
ఇది పనామా దేశం యొక్క జాతీయ పక్షి. బ్రెజిల్ లో ఈ యొక్క హార్పీ డేగను రాయల్ హాక్ అనికూడా పిలుస్తారు.
డేగ యొక్క అతిపెద్ద జాతులలో హార్పీ ఒకటి. ఆడ మరియు మగ పక్షుల మధ్య పరిమాణంలో తేడా ఉంటుంది. వీటిలో మగవాటి కంటే ఆడవి పెద్దవిగా ఉంటాయి. ఆడ పక్షులు 36-40 అంగుళాల వరకు పెరుగుతాయి. ఈ ఆడ పక్షుల యొక్క బరువు 6 నుండి 9 కిలోల వరకు ఉంటాయి. మగ పక్షుల యొక్క బరువు 4 నుండి 5 కిలోల వరకు ఉంటాయి. ఇవి 3.-4 అడుగుల పొడవు మరియు 6-8 అడుగుల రెక్కలను కలిగి ఉంటాయి. వీటి యొక్క కాలి గోళ్లు 5 అంగుళాల పొడవు కలిగి ఉంటాయి వీటి పంజాలు గ్రిజ్లీ ఎలుగుబంటి పంజాల కన్నా పెద్దవిగా ఉంటాయి.
హార్పీ ఈగిల్ ముదురు బూడిద రంగు ఈకలను, క్రింది వైపు తెల్లని ఈకలను మరియు మెడ చుటూ నల్లని ఈకలను కలిగి ఉంటాయి. మగ మరియు ఆడ పక్షులు చూడటానికి ఒకేలా ఉంటాయి. చిన్న పక్షులు తెలుపు మరియు లేత బూడిద రంగులో ఉంటాయి, అవి 3 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు వాటి యొక్క సహజ రంగులను పొందలేవు.
ఈ యొక్క హార్పీలు వేటాడేటప్పుడు గంటకు 50 మైళ్ల వేగంతో ఎగురుతాయి.
హార్పీ ఈగల్స్ పూర్తిగా మాంసాహారులు. ఇవ్వి కోతులు, అర్మడిల్లోస్, ఒపోసమ్స్ వంటి క్షీరదాలను, చిలుక వంటి పక్షులను, ఇగువానాస్ వంటి సరీసృపాలను మరియు బద్దకంగా ఉన్న ఏ జంతువుల నైనా వేటాడతాయి
ఇవ్వి తమ ఆహారాన్ని పట్టుకున్న తర్వాత దానిని తినడానికి సాధారణంగా చెట్ల చిటారు కొమ్మలకు తీసుకువెళతాయి. ఇవ్వి కొంచెం పెద్ద జంతువులను వేటాడినట్లయితే దానిని పడిపోయిన చెట్ల కొమ్మలలో లేదా మరెక్కడైనా రహస్యంగా దాచుకుని కొన్ని రోజులు పాటు తింటాయి.
హార్పీ ఈగిల్ యొక్క కాళ్ళు మరియు పంజాలు చాలా బలంగా ఉన్నాయి, ఇది దాని ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసుకోవడానికి వాటి యొక్క ఎముకలలో 50 కిలోల కంటే ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది.
ఆడ హార్పీ ఈగిల్ అడవి మధ్యలో ఎగురుతూ చెట్ల కొమ్మల మధ్యలో ఉన్న 7.7 కిలోల కోతిని గురి తప్పకుండా తన్నుకు పోతుంది.
హార్పీ ఈగల్స్ పగటిపూట మాత్రమే వేటాడతాయి.
ఇవ్వి చాలా ఎత్తులో ఒకే చోట గంటల తరపడి కూర్చుని ఆహారం దొరికే వరకు వేచి ఉంటాయి. హార్పీ ఈగల్స్ అద్భుతమైన దృష్టిని కలిగి ఉంటాయి, ఇవ్వి దాదాపు 200 మీ దూరంలో ఉన్న తమ ఆహారాన్ని స్ప్రష్టంగా చూడగలవు.
ఇవ్వి కపోక్ చెట్టు లేదా కంబారా చెట్టు వంటి భారీ చెట్ల మీద కర్రలు, కొమ్మలతో తయారు చేయబడిన మరియు మృదువైన పదార్థాలతో కప్పబడిన పెద్ద గూళ్ళు నిర్మించుకుంటాయి. భూమి నుండి కనీసం 90 అడుగుల ఎత్తులో ఉండి 5 అడుగుల వరకు ఉంటాయి. హార్పీ జంట చాలా సంవత్సరాలుగా అదే గూడును తిరిగి ఉపయోగిస్తుంది. ఆడ హార్పీ ఈగిల్ లైంగికంగా 4 మరియు 5 సంవత్సరాల మధ్య పరిపక్వం చెందినప్పుడు 1 లేదా 2 గుడ్లు పెడుతుంది. గుడ్లు పొదుగుటకు 50 రోజులు పడుతుంది మరియు ఆ పిల్లలు ఎగరడానికి 4 నుండి 6 నెలల వరకు సమయం పడుతుంది.
ఆడ పక్షులు గుడ్లను పొదిగించి పిల్లలని చూసుకొనేటప్పుడు మగవి ప్రతి 2 లేదా 3 రోజులకు ఆహారం తీసుకువచ్చి ఇస్తాయి. ఆడ పక్షి గుడ్లు పొదిగేటప్పుడు, సమీపంలోని ఉన్న మగవి “వీహీ… వీహీ… వీహీ” శబ్దాన్ని చేస్తాయి. ఆడ పక్షి కూడా ఇదే తరహాలో స్పందిస్తుంది కాని దాని యొక్క స్వరం వేరే విధంగా ఉంటుంది.
ఐదు లేదా ఆరు నెలల వయస్సులో పిల్లలు ఎగరడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, తల్లిదండ్రులు 10 నెలల వరకు వాటికి తినిపించడం కొనసాగిస్తాయి. చిన్నఈగల్స్ ఒకటి లేదా రెండు సంవత్సరాలు వారి తల్లిదండ్రులతోనే ఉంటాయి, తద్వారా అవి ఎలా వేటాడాలో నేర్చుకుంటాయి. ఈ యొక్క పక్షులు పిల్లలని పెంచే సమయంలో కాకుండా మిగిలిన టైం లో 6 నుండి 10 నెలలకొకసారి తమ గూటికి తిరిగి వస్తాయి. ప్రతి హార్పీ డేగల జత 2-4 సంవత్సరాలకు ఒక పిల్లని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది.
శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం హార్పీ ఈగల్స్ తరచుగా రెండు గుడ్లు పెడతాయి కానీ అవ్వి ఒక పిల్లని మాత్రమే పెంచుతాయి. మొదటి గుడ్డు విజయవంతంగా పొదిగినట్లు చూసిన తర్వాత ఈగల్స్ రెండవ గుడ్డును పొదిగడాన్ని ఉద్దేశపూర్వకంగా ఆపివేస్తాయి. మొదటి గుడ్డుకు ఏదైనా జరిగితే, అవి రెండవ గుడ్డును బ్యాకప్ గా ఉపయోగిస్తాయి. వీటియొక్క సంభోగం సాధారణంగా ఏప్రిల్-నవంబర్ మధ్య ఉంటుంది.
హార్పీ ఈగల్స్ ప్రతి రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే గుడ్లు పెడతాయి. దీనికి కారణం అవి తమ పిల్లలను ఎక్కువ కాలం పాటు పెంచుతాయి. వాటి యొక్క పిల్లలు స్వతంత్రంగా ఉండే వరకు అవి సహజీవనం చేయవు లేదా గుడ్లు పెట్టవు.
ఈ డేగల యొక్క గూడు నుండి శబ్దాలు చాలా అరుదుగా వినిపిస్తాయి. వర్షం లేదా ఎక్కువ ఎండకు బాధపడుతున్నప్పుడు, గూడు పిల్లలు “చి-చి-చి-చి” పిలుపునిస్తాయి. ఇంకను ఈలలు మరియు క్వాకింగ్ శబ్దాలు చేస్తాయి.
ఈ హార్పీ ఈగిల్స్ క్రెస్టెడ్ ఈగిల్ (మోర్ఫ్నస్ గయానిసిస్)(Morphnus guianesis) మరియు న్యూ గినియా హార్పీ ఈగిల్స్ తో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంది.
సాంకేతికత పెరిగిన తరువాత అడవులు నరికివేత వల్లన వీటి యొక్క వృద్ధి చాలా తక్కువైందని చెప్పాలి. ప్రస్తుతం వీటి యొక్క సంఖ్య 20,000 నుండి 50,000 పక్షులు వరకు ఉంటాయని బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ అంచనా వేసింది
హార్పీ ఈగల్స్ వెస్ట్ నైలు వైరస్ (దోమల నుండి వ్యాపిస్తాయి) వంటి వైరల్ వ్యాధులను కలిగి ఉంటాయి; న్యూకాజిల్ వ్యాధి (సోకిన పక్షులు మరియు కలుషిత నీటి నుండి సంకోచించబడింది); మరియు ఏవియన్ పాక్స్ (ఇతర పక్షులచే వ్యాప్తి చెందుతాయి).
ఏదేమైనా, మానవునికి ఈ హార్పీ డేగ నుండి వచ్చే వ్యాధుల అవకాశం చాలా తక్కువ.





0 comments
Post a Comment