గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
మన దేశంలో విద్య అనేది UGC ACT-1956 ప్రకారం Non-Profitable అని మీ అందరికి తెలిసిందే. అలానే UGC ACT Section 26(1) (జి) ప్రకారం యుజిసికి "ప్రమాణాల నిర్వహణ మరియు విశ్వవిద్యాలయాలలో పని లేదా సౌకర్యాల సమన్వయాన్ని" నియంత్రించే అధికారాన్ని ఇస్తుంది. అలానే ఉన్నత విద్యా సంస్థలలో ఫీజులను నియంత్రించడానికి యుజిసికి అధికారం గలదు.
ఈ యొక్క UGC, AICTE ల యొక్క పనితీరు గురుంచి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, విద్యాసంస్థలలో పనిచేసే ప్రతియొక్క ఉద్యోగిగి తెలుసు
విద్య అనేది కేవలం సేవ మాత్రమే కానీ మన దేశంలో 98% ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యను ఒక వ్యాపార కోణంలో మాత్రమే చూస్తున్నాయి. దీని గురించి అధికారులకు మరియు ఆయా ప్రభుత్వాలకు మొత్తం తెలిసినను కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు.
మన తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాల్లో 12,088 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి, సుమారు 2.5 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
ఇంకా రాష్ట్రంలో సుమారు 1,498 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు మరియు 600 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి, ఇందులో 40,000 మంది లెక్చరర్లు ఉన్నారు.
Schools, Intermediate మరియు Degree కళాశాలలే కాకుండా ఇంకా Engineering(212), Pharmacy(129), MBA(304), MCA(42) కళాశాలలు మొత్తం కలిపి సుమారు 687 వరకు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. వీటిలో పనిచేసే అధ్యాపకుల సంఖ్య 40,000 నుండి 50,000 వరకు ఉంటారు.
COVID-19 మహమ్మారి కారణంగా దాదాపు 1.9 లక్షల మంది ప్రైవేట్ ఉపాధ్యాయులను తొలగించారని, 2020 March నుంచి 80% మంది ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేదని ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయం. అలానే Intermediate & Degree కళాశాలల్లో పనిచేసే 90% ప్రైవేట్ లెక్చరర్లు నిరుద్యోగులుగా మారారు. ఇంకా వృత్తి విద్యా సంస్థల్లో పనిచేసే అధ్యాపకులు చాలా మంది తమయొక్క జీవనోపాధిని కోల్పోయారు. కానీ అధికారుల లెక్కల ప్రకారం వీరంతా కళాశాల్లోనే పనిచేస్తున్నారని, ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నాయని చెప్తున్నారు.
Education Act 1982 Chapter 14, Section 79 ప్రకారం, విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగిని తొలిగించాలంటే ఆ యొక్క శాఖకు సంబందించిన పై అధికారి యొక్క ముందస్తు అనుమతి తీసుకుని, విచారణ జరిపిన తరువాత ఆరోపణలు రుజువైతే అప్పుడు ఆ యొక్క ఉద్యోగిని తొలిగించే అధికారం కలదు.
అలానే కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన G.O 45 ప్రకారం ఎవ్వరిని ఉద్యోగాల నుండి తొలగించవద్దు అని పేర్కొన్నది అయినను కూడా ఏ ఒక్క విద్యా సంస్థ యాజమాన్యం కూడా ఈ యొక్క Education Act, G.O. 45 లను పట్టించుకోలేదు. ఈ తతంగం మొత్తం కూడా అధికారులకు తెలిసినను కూడా పట్టించుకోవడం లేదు. దీనిని బట్టి చూస్తుంటే ఈ యొక్క అధికారులు ప్రైవేట్ యాజమాన్యాలకు సహకరిస్తున్నట్లు అనిపిస్తుంది.
కొన్ని సాంకేతిక కళాశాలలు ఉద్యోగులకు 50% మాత్రమే జీతాలు చెల్లించాయి, ఎందుకని అడిగితె గతంలో High Court ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము 50% జీతాలు చెల్లించాము అని చెప్తున్నాయి. ఈ యొక్క Corona మహమ్మారి వల్ల ఇంతమంది ఉద్యోగులు రోడ్డున పడుతుంటే ఈ యొక్క న్యాయస్థానాలు కూడా జాప్యం చేస్తున్నాయి.
Education Rules & Regulations ప్రకారం ప్రతి యొక్క ఉద్యోగికి Group Insurance చేయించాలి కానీ ఎక్కడో అరకొర కళాశాలలు మాత్రమే నిబంధనలు పాటిస్తున్నాయి. కొన్ని కళాశాలలు తనిఖీలప్పుడు చూపెట్టుకోవడానికి Group Insurance చేయించి ఆ యొక్క మొత్తాన్ని తిరిగి ఉద్యోగుల జీతాలతో కోత పెడుతున్నాయి ఇదేమిటని అడిగన వారిని నిబంధనలు ఉల్లంఘించి ఉద్యోగాల నుండి తొలిగిస్తున్నారు. దీని గురించి అధికారులకు ఫిర్యాదు చేసిన కూడా, ఆ యొక్క అధికారులు యజమాన్యాలకే సహకరిస్తున్నారు.
ప్రైవేట్ అధ్యాపకులు ఈ రోజు ఈ యొక్క పరిస్థితుల వల్ల వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక స్థోమత లేక చాలామంది మిత్రులు Corona బారిన పడి మనకి దూరం అయ్యారు. ఇంకా కొంతమంది మిత్రులు ఆర్థిక బాధల తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. అలానే ఎంతో మంది ఉద్యోగులు కుటుంబాన్ని పోషిచుకోవడానికి కూలీపని చేసుకుని దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు.
అలానే మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రైవేట్ Teachers ని ఆదుకోవడానికని Rs.2000/- మరియు 25 K.G. ల బియ్యం ఇస్తున్నాయి. దీనికి రాష్ట్రంలో మొత్తం 1,18,004 మందిని మాత్రమే అర్హులుగా ప్రకటించింది. ఇందులో 1,06,383 బోధనా సిబ్బంది, మిగిలిన వారు 11,621 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు కానీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఒక్క Private Teachers నే 2,50,000 మంది ఉన్నారు మరి మిగతా 1,32,000 మంది అర్హులుకారా ? అలానే 40,000 మంది ప్రైవేట్ లెక్చరర్స్ వీటిని పొందటానికి అర్హత లేదా? మరి వృత్తి విద్యా కోర్స్ లల్లో పనిచేసే వారి సంగతేంటి?
ఇంతమంది ఉద్యోగాలు కోల్పోయారని Govt., నే స్వయంగా ఒప్పుకుంటుంది. ఇన్ని లక్షల మంది ప్రైవేట్ ఉద్యోగులు రోడ్డున పడితే, దానికి కారణం అయినవారిపైన చర్యలు తీసుకోకుండా ముష్టి 25 కేజీల బియ్యం మరియు 2000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంది. దీనిని బట్టి అర్ధం అవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పని తీరు. ఇంకా ఈ ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యాలకు ఎలా కొమ్ముకాస్తున్నారో! దీనికి కారణం చాలామంది యాజమాన్యాలు ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధుల యొక్క బంధువులు లేదా వారియొక్క సొంత విద్యాసంస్థలు.
అధ్యాపక మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి.
ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తిలో మీలో ఎంతమంది సమాన పనికి సమాన వేతనం తీసుకుంటున్నారు?
ఈ ప్రైవేట్ యాజమాన్యాల దోపిడీల వల్లన మనతో పాటు విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది. ఇంకా ఎంతో మంది విద్యార్థుల తల్లితండ్రులు ఈ ఫీజులు కట్టలేక అప్పుల ఊబిలో చిక్కుకుపోయి ఆత్మహత్యలు చేసుకునేవరకు వస్తున్నాయి.
ఇకనైనా ప్రశ్నించకపోతే మన బతుకులు, మన పిల్లల బతుకులు బానిసల్లాగానే బ్రతక వలసి వస్తుంది.
మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి ఇకనైనా ప్రశ్నిద్దాం, పోరాడుదాం న్యాయపరంగా మనకు ఉండాల్సిన హక్కులు మనం సాధించుకుందాం. మన మన పిల్లలకి మంచి భవిష్యత్తు కొరకై పునాది వేద్దాం.


0 comments
Post a Comment