జనాభా వెయ్యిన్నర సమాధులు మాత్రం లక్షన్నర!!

Colma California Cemeteries
పల్లెల్లో, పట్నాల్లో అభివృద్ధి మాటెలా ఉన్నా... చస్తే పాతిపెట్టడానికి శృశానాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. కానీ, సీటీ సొగసుల కోసం ఒక ఊరు ఉన్న సమాధులను పెకిలిస్తే, ఆ సమాధులను తనలో దాచుకుంది మరో ఊరు. ఇప్పుడు ఆ ఊరి జనాభా వెయ్యిన్నర ఉంటే.. సమాధులు మాత్రం లక్షన్నరకి పైనే ఉన్నాయి. అందుకే ఆ ఊరికి 'శృశానాల ఊరు'గా ముద్రపడింది.

కోమా... కాలిఫోర్నియా సాన్‌ మాటె కౌంటీలో ఉన్న ఒక ఊరు. ఇది శాన్‌ ఫ్రాన్సిస్కో తీరాన్ని ఆనుకుని ఉంది. మొదటగా 19వ శతాబ్దంలో కొందరు వలసొచ్చి ఇక్కడ సెటిల్‌ అయ్యారు. అంతకుముందు సరుకుల రవాణా కోసం ఈ ప్రాంతంలో ఒక రైల్వే స్టేషన్‌ను కట్టించారు. అయితే ఇలా వలస వచ్చిన వాళ్లు వ్యవసాయంతో ఈ ప్రాంతానికి గుర్తింపు తీసుకొచ్చి... ఊరికి 'కోమా' అని పేరు పెట్టుకున్నారు. ఈ పేరు 'కోలిమా” (అగ్నిపర్వతం) అనే పదం నుంచి వచ్చిందని చెప్తారు. ప్రస్తుతం కోమాలో 330 ఇళ్లు, 245 కుటుంబాలు, 1700 మందికి పైగా జనాభా ఉంది. ఆటోమొబైల్స్‌, రిటైల్‌ బిజినెస్‌లతో ఈ ఊరు బాగా డెవలప్‌ అయ్యింది. అంతేకాదు 1986లో 280 దుకాణాలతో ఒక భారీ కాంప్లెక్స్‌ను ఈ ఊళ్లో ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే ఇది మొదటి పవర్‌ సెంటర్‌ (పెద్ద అవుట్‌డోర్‌ షాపింగ్‌ మాల్‌). అమెరికాలో జరిగే మెయిన్‌ బాక్సింగ్‌ ఈవెంట్స్‌... ఎక్కువగా ఇక్కడే జరుగుతుంటాయి. అయితే ఈ ఊరి భూభాగంలో 73 శాతం సమాధులే కనిపిస్తాయి. నిజానికి ఇక్కడ సెటిల్‌ అయినవాళ్లలో ఎక్కువ మంది సమాధుల తరలింపు పని మీద వచ్చిన వాళ్లే!.

మోడ్రనైజేషన్‌ ప్రాజెక్టులో భాగంగా...

అమెరికాలో చాలా ఊర్లు అవుట్‌మాల్స్‌, వాల్‌మార్ట్స్‌కు ఫేమస్‌. కానీ, కోమా మాత్రం వెరైటీగా సమాధులతో ఫేమస్‌ అయ్యింది. ఈ టౌన్‌లో మొత్తం పదిహేడు శృశానవాటికలు ఉన్నాయి. కానీ, వీటిల్లోని సమాధులు ఈ ఊరివాళ్లవి కావు
1900 సంవత్సరంలో శాన్‌ఫ్రాన్సిస్కో నగరీకరణ ప్రాజెక్టులో భాగంగా అక్కడి శృశానాల్లోని సమాధులను తవ్వించి... కోమాకి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కేవలం నాలుగు చిన్నశ్మశానాల్లో... అది కూడా బాగా డబ్బున్న వాళ్ల సమాధులను కదలించకూడదని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయంపై జనాల నుంచి వ్యతిరెకత వెల్లువెత్తింది. కొందరు సమాధులని తవ్వి అందులోని పుర్రెలతో రోడ్లపై పుట్‌బాల్‌ ఆడి నిరసన చెప్పారు. అయినా కూడా అధికారులు తగ్గలేదు. బలవంతంగా సమాధుల్నితవ్వించి... గుర్రపు బండ్లలో శవపేటికలను పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నకోమా టౌన్‌కు తరలించారు. అక్కడ కొత్తగా శ్మశానవాటికలను ఏర్పాటు చేయించి... అందులో వాటిని పాతించారు. 1906లో శాన్‌ఫ్రాన్సిస్కో భారీ భూకంపం వల్ల మూడు వేల మంది చనిపోయారు. ఆ శవాల్లో ఎక్కువగా కోమాలోనే పాతిపెట్టారు.
శాన్‌ఫ్రాన్సిస్కోలో సమాధుల్ని తవ్వినప్పటి దృశ్యం 
 
ప్రముఖుల సమాధులు
శాన్‌ఫ్రాన్సిస్కో అధికారులు ఒక్కో సమాధి తరలింపు కోసం 10 డాలర్లు ఖర్చు చేశారు. అలా నలభై ఏళ్లపాటు శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి లక్షా యాభై వేలకు పైగా సమాధులతో కోమా నిండిపోయింది. దీంతో 1924లో ఈ ఊరిని “సమాధుల ఊరు”గా గుర్తింపు దక్కించుకుంది. కోమా 'ది హోలీ క్రాస్‌ సెమెట్రీలో నలభైవేల మందిని, 'సైప్రస్‌ లాన్‌ గ్రేవ్‌యార్డ్‌'లో ముప్పై వేల మందిని ఖననం చేశారు. అయితే శ్మశానాల్లోనే కాకుండా మిగతా చోట్ల కూడా అక్కడక్కడ అస్థిపంజరాలు బయటపడుతుండడం విశేషం. పైపింగ్‌ లైన్ల కోసం, కొత్తగా బిల్జింగ్‌ల కోసం తవ్వకాలు జరిపేటప్పుడు ఎముకల గూడులు గుట్టలుగా బయటపడుతున్నాయి. దీంతో వాటిని సముద్రంలోకి డంప్‌ చేస్తున్నారు. 
అయితే ఇక్కడున్న సమాధుల్లో ప్రముఖుల సమాధులు కూడా ఉండడం విశేషం. పాపులర్‌ జీన్స్‌
బ్రాండ్‌ వ్యాపారి లెవీ స్టాస్‌, చక్రవర్తి జోషువా నోర్జాన్‌, ఫేమస్‌ న్యూరోసైన్స్‌ పేషెంట్‌ పినియాస్‌ గేజ్‌, 'సీల్స్‌ టుది జెయింట్స్‌ అనే వాలీబాల్‌ టీం మెంబర్స్‌ మొత్తాన్ని కోమా శృశానాల్లోనే ఖననం చేశారు. 'సిటీ ఆఫ్‌ ది డెడ్‌” పేరు ఉండడంతో చాలాకాలం పాటు కోమా వైపు వెళ్లే ధైర్యం చేయలేదు చాలామంది. దీంతో 'ఇట్స్‌ గ్రేట్‌ టు బి లివ్‌ ఇన్‌ కోమా” అనే ప్రచారంతో జనాలను ఆకట్టుకుంది ఆ ఊరి కౌన్సిల్‌. అంతేకాదు 'సిటీ ఆఫ్‌ సోల్స్‌”, 'సిటీ ఆఫ్‌ సైలెంట్‌” అనే ట్యాగ్‌ లైన్లతో టూరిస్టులను సైతం ఎట్రాక్ట్‌ చేస్తోంది






































0 comments

Post a Comment