హైపర్‌లూప్ Trains తో గంటకు 1200 కిలోమీటర్ల స్పీడ్ తో జర్నీ
హైదరాబాద్ నుంచి ఢిలీకి రైలులో వెళాలంటే దాదాప ఒక రోజంతా జర్నీలోనే సరిపోతుంది. ఒకవేళ బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వల్చినా నాలుగైదు గంటల సమయం పడుతుంది. అదే ఇప్పుడు అమెరికాలో వర్దిన్ హైపర్‌లూప్ కంపెనీ పనులు చేపడుతున్న ఈ 'హైపర్‌లూప్” ట్రావెల్ సిస్టమ్‌లో అయితే కేవలం గంటన్నరలోపే ఢిల్లీలో ఉండొచ్చు. ఇక్కడ ట్రైన్తోనే పోల్చడానికి 'కారణం...ఇది కూడా ఒక రైల్వే సిష్టమ్ లాంటిదే. హైపర్‌లూప్ అనేది అయస్కొంత శక్తితో పని చేసే వ్యాక్యూమ్ ట్రైన్. దీనిలోగంటకు 1200కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకెళొచ్చు.
బెస్ట్‌రన్ సక్సెస్
2014లో స్పేస్ ఎక్స్ మాజీ సైంటిస్ట్ జాన్ జిగెల్, సారా లూషియన్ కలిసీ ఈ వర్దిన్ హైపర్‌లూప్ కంపెనీని ను ప్రారంభించారు. Advanced ట్రావెల్ System డెవలప్ చేయాలన్న లక్ష్యంతో ఈ సంస్థ నాటి నుంచి work చేస్తోంది. 2019 నాటికి ప్రయోగాలు ఒక కొలిక్కి వచ్చాయి. దీంతో అమెరికాలోని లాస్ వెగాస్ సమీపంలో ఉన్న నెవడా ఎడారిలో హైపర్‌లూప్ కన్‌స్ట్రక్షన్‌ను ఆ కంపెనీ మొదలుపెట్టింది. ట్రైన్ పట్టాల మీద నడిచినట్టే... హైపర్‌లూప్‌ట్రావెల్ సిస్టం లో కూడా భారీ ఐరన్ ట్యూబ్ ట్రాక్ లా ఉంటుంది. దానిలోనే చిన్న సైజు మెట్రో కోచ్ లాంటివి హైస్సీడ్‌తో దూసుకెళ్లాయి. ధీనిలో ఒకేసారి 28 మంది ప్రయాణం చేసే వీలుంటుంది. గత ఏడాది 2020 నవంబర్‌లో హైపర్‌లూప్‌లో టెస్ట్ రన్ కూడా నిర్వహించి సక్సెస్ అయింది.
పక్కా సేఫ్
'ఈ హైపర్‌లూప్ సిస్టమ్‌లో గంటకు 1200 కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకెళ్లొచ్చని కంపెనీ కో ఫౌండర్, CEO జిగెల్ చెబుతున్నారు. అయితే ఇది పబ్లిక్ ట్రావెల్‌కు అందుబాటులోకి రావడానికి ఇంకా ఆరేండ్ల వరకు టైమ్ పట్టొచ్చు. 2027 నాటికి కమర్షియల్ ఆపరేషన్స్ మొదలవుతాయని జీగెల్ తెలిపారు. అమెరికాలోని నెవడాలో ప్రయోగాత్మకంగా అర కిలోమీటర్ హైపర్‌లూప్ సీస్టమ్ ట్యూబ్ నిర్మాణం చేశామని, దీనిలో గత ఏడాదిలో నిర్వహించిన టెస్ట్ రన్‌లో సేఫ్టీని చెక్ చేశామని తెలిపారు.కేవలం 15 సెకన్ల టైమ్‌లోనే ఈ 500 మీటర్ల జర్నీపూర్తయిందని, టెక్నికల్‌గా హై సేస్టీతో.
ఉందని చెప్పారు. గాలి లేని వ్యాక్యూమ్ ట్యూబ్‌లో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ, లో ప్రెజర్ సాయంతో ఇందులో 1200 కిలోమీటర్ల స్పీడ్ జర్నీ చేయగలమని, ఒకరకంగా విమానంలో ప్రయణిస్తున్న అనుభూతిని ఇది ఇస్తుందని చెప్పారు. అయితే ఎటువంటి శబ్ధం రాకుండా, పొల్యూషన్ లేకుండా ప్రయాణం సాగుతుందన్నారు. న్యూయార్క్ నుండి వాషింగ్టన్‌కు దీనిలో అర గంటలోపే వెళ్లిపోవచ్చని, కమర్షియల్ ఫ్లయిట్ తో పోల్చుకుంటే ఇది రెండింతల వేగమని, హై స్పీడ్ ట్రైన్స్ కంటే 4రెట్ల స్పీడ్ జర్నీ అని జిగేల్ అన్నారు.
1960లోనే అనుకున్నా.
ఇలాంటి హైస్సీడ్ ట్రావెల్ సిస్టమ్ ఆలోచన ఎప్పటినుంచో ఉన్నదే. దాదాపు వందేళ్ల క్రితమే రాకెట్ సైంటిస్ట్ రాబర్ట్ గడర్ట్ ఈ తరహా ఆలోచనను ప్రతిపాదించారు. అలాగే 1960 లో ఎయిరో ట్రైన్ డెవలప్ చేయాలని ఫ్రాన్స్‌కు చెందిన కొన్ని కంపెనీలు ప్రయత్నించి. సరైన ఫండింగ్ లేక అప్రాజెక్ట్‌ను పక్కన పడేశాయి. ఈ ఆలోచనపై2013లో స్పేస్ ఎక్స్ సంస్థ ఫౌండర్ ఎలన్ మస్క్ దృష్టిసారించారు. ఈ ప్రాజెక్ట్‌పై అ సంస్థలో ఉండగా పని చేసిన సైంటిస్ట్ జిగెల్ 2014 లో virgin సంస్థ సహకారంతో వర్జిన్ హైపర్‌లూప్ అనే సంస్థను 'దాని సబ్సిడీగా ప్రారంభించారు.
- హైపర్‌లూప్ లో ప్రీక్షన్ లేకుండా హై స్పీడ్ తో కోచ్ దూసుకెళ్లేందుకు ట్యూబ్ లో గాలిని తీసేస్తారు.
- హైపవర్ ఎలక్ట్రో మాగ్నెటిక్ ఎనర్జీ సహాయంతో గంటకు 1200 కిలోమీటర్ల స్పీడ్ సాధ్యమవుతుంది.
- ట్యూబ్ లో కొద్దో గొప్పో గాలి మిగిలి ఉన్నా దానిని లాగేసేందుకు కోచ్ ముందు భారీ ఫ్యాన్ ఉంటుంది.
- ఒక్కసారి టాప్ స్పీడ్ కు రీచ్ అయ్యాక ఎటువంటి అదనపు పవర్ తో పని లేకుండా అయస్కాంత శక్తి ఆధారంగా దూసుకెళ్లిపోతుంది.
0 comments
Post a Comment