Save Lakshadweep Campaign: లక్షద్వీప్‌లో కొత్త అలజడి వివాదాస్పదమైన అడ్మినిస్ట్రేటర్‌ విధానాలు

Save Lakshadweep Campaign

భారత ప్రధాన భూభాగానికి దూరంగా, అరేబియా సముద్రంలో ఉండే కేంద్రపాలిత ప్రాంతమైన ‘లక్ష ద్వీప్‌’లో రాజకీయ కార్యకలాపాలు చాలా తక్కువ. ఇది ప్రముఖ పర్యాటక ప్రాంతంగానే అందరికి తెలిసింది. అలాంటిది ఇప్పుడు ఇక్కడ ‘సేవ్‌ లక్ష ద్వీప్‌’ అంటూ ఏకంగా ఉద్యమమే సాగుతోంది. ఇందుకు ఇతర ప్రాంతాల్లోనూ మద్దతు లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తమ ‘జీవితాలు, జీవనోపాధి, సంస్కృతి’కి నష్టం కలిగిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ‘లక్షదీప్‌కు కొత్త రూపం’ పేరుతో ఈ ప్రాంతం అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ కె పటేల్‌ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలే దీనికంతటికీ కారణం. 
Lakshadweep Administrator Praful Patel

సమస్య ఏమిటి?
ఈ కేంద్రపాలిత ప్రాంతానికి అడ్మినిస్ట్రేటర్లుగా Retired  ఉన్నతాధికారులను నియమించడం సంప్రదాయంగా వస్తోంది. ఇంతకముందు Administrator గా పనిచేసిన దినేశ్వర్‌ శర్మ డిసెంబరులో మరణించడంతో, Dadra and Nagar Haveli and Daman and Diu లకు అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్నటువంటి ప్రఫుల్‌ పటేల్‌ను ఇక్కడ ఇన్‌ఛార్జిగా నియమించారు. ఈయన గతంలో గుజరాత్ హోంమంత్రిగా పనిచేసిన మాజీ బిజెపి నాయకుడు మరియు ప్రధానికి అత్యంత సన్నిహితుడు కూడా. ఆయన ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాల వల్లనే ప్రజల్లో అసంతృప్తి కలిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

ఇటీవల ప్రఫుల్ పటేల్  ‘లక్ష ద్వీప్‌’లోకొత్త సంస్కరణలను ప్రకటించారు. ఇది స్థానికులకు మరియు పొరుగు రాష్ట్రమైన కేరళకు బాగా విసుగు తెప్పించింది. 
Lakshadweep Development Authority Regulation 2021 (LDAR) ప్రకారం, పట్టణ ప్రణాళిక లేదా ఏదైనా అభివృద్ధి కార్యకలాపాల కోసం అక్కడి ప్రజల ఆస్తులను తొలగించడానికి లేదా మార్చడానికి  ప్రభుత్వానికి మరియు దాని అన్ని ఏజెన్సీలకు అధికారాలను ఇస్తు రూపకల్పన  చేశారు. 
అలాగే, జనవరి 2021 లో ప్రవేశపెట్టిన Prevention of Anti-Social Activities Act (PASA) ప్రకారం, ఎటువంటి  అనుమతి లేకుండా  ఒక  వ్యక్తిని బహిరంగపరచకుండా  ఒక సంవత్సరం వరకు నిర్బంధించే అధికారాన్ని ప్రభుత్వానికి ఇస్తుంది
ఈ ప్రాంతంలో నేరాల సంఖ్య చాలా తక్కువ. అయినా గూండా చట్టాన్ని అమలు చేశారు.
ఇంతవరకు విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మత్స్య, పశుపోషణ శాఖలు జిల్లా పంచాయతీల పరిధిలో ఉండగా, వాటిని అడ్మినిస్ట్రేటర్‌ పరిపాలన కిందకు తీసుకువచ్చారు.
ఇక్కడ మద్యం నిషేధం అమల్లో ఉంది. అయినప్పటికీ పర్యాటకపరంగా బాగా అభివృద్ధి చెందింది అయినను కానీ పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో (ప్రఫుల్‌ పటేల్‌) ఇప్పుడున్నటువంటి Administrator మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చారు.
2019లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గోడపత్రికలు  అతికించారన్న కారణంతో కేసులు పెట్టించారు
ఈ దీవుల్లో అధిక సంఖ్యలో ఉండేది మైనార్టీలే. వారంతా మాంసాహారులు. కక్షపూరితంగా జంతువధను, బీఫ్‌ను నిషేధించారు

కేరళ ఎంపి ఎలమారామ్ కరీం (Kerala MP Elamaram Kareem) రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు రాసిన లేఖలో, ఈ యొక్క కొత్త నిబంధనల ప్రకారం అక్కడ చాలా మంది సాధారణ మరియు కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారని పేర్కొన్నారు. 

అలానే మత్స్యకారులు తమ వలలు మరియు ఇతర సామగ్రిని ఉంచడానికి ఉపయోగించే షెడ్లను కోస్ట్ గార్డ్ చట్టాన్ని ఉల్లంఘించారనే కారణంతో కొత్త పరిపాలన కూల్చివేసింది. 
తగిన పత్రాలు ఉన్నప్పటికీ, ఎటువంటి హెచ్చరిక లేకుండా అక్రమ కట్టడాల పేరుతో నిబంధనలు పాటించకుండా చాలా మంది ఇళ్లను కూలగొట్టారు. 

లక్ష ద్వీప్‌ వాసులు సరుకు రవాణా కోసం ఎక్కువగా కేరళలోని బైపూర్‌ నౌకాశ్రయంపై ఆధారపడతారు. ద్వీపవాసులు సరుకు రవాణా కోసం ఇకపై బేపూర్ (కేరళ) పై ఆధారపడకూడదని దానికి బదులుగా సరుకుల రవాణా కోసం మంగుళూరు (కర్ణాటక) పై ఆధారపడాలని పరిపాలన యంత్రంగం నిర్ణయించింది.

పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో నిరంకుశత్వంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆ ప్రాంతం యువత సామాజిక మాధ్యమాల ద్వారా ‘సేవ్‌ లక్షదీప్‌’ పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించింది. 
3.5 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ఓ దీవిని ఓ కార్పొరేట్‌ కంపెనీకి అప్పగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని లక్షదీప్‌ ఎంపీ మహమ్మద్‌ ఫైజల్‌ (ఎన్‌సీపీ) ఆరోపించారు. దానికి 15 మీటర్ల వెడల్పుగల రోడ్డు వేసేందుకు కొందర్ని ఖాళీ చేయిస్తున్నారని విమర్శించారు. ఈ దీవులను కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. అడ్మినిస్ట్రేటర్‌ను వెనక్కి పిలవాలంటూ కేరళ ఎంపీలు రాష్ట్రపతికి వినతి పత్రాలు పంపించారు.

Introduction of the anti-social Activities Regulation Bill-2021
Lakshadweep Land Development Initiatives
Beep ban in Lakshadweep
Lakshadweep Administrator Praful Patel
Administrative crisis in Lakshadweep
Widespread resentment in Lakshadweep over a slew of bad law proposals
What is the Save Lakshadweep campaign
Resentment brews against Lakshadweep administration
Behind the reason of Save Lakshadweep Campaign
wat is Save Lakshadweep Campaign

0 comments

Post a Comment