What are the 5 most dangerous animals in the Amazon rainforest?
Dangerous animals in amazon forest
What's the most dangerous animal in the Amazon?
How dangerous is Amazon forest?
What is the most dangerous part of the Amazon rainforest?
Is it safe to swim in the Amazon River?
Why is Amazon jungle dangerous?
Are there tigers in the Amazon?
Unbelievable things on Amazon
దక్షిణ అమెరికాలోని దట్టమైన అమెజాన్ అడవులు సహజ సౌందర్యనికి పెట్టింది పేరు. ఈ అడవులు చూడటానికి ఎంత అందంగా ఉంటాయో అంతకంటే ప్రమాదకరమైనవి. అమెజాన్ లోని జాగ్వార్స్, ఎలిగేటర్స్, అనకొండస్ వంటి ప్రమాదకరమైన జంతువులతోపాటు పాములు, కప్పలు వంటి ఎన్నో రకాల విషపూరితమైన జీవులకు ఆవాసాలు. అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ లో దోమ కాటుల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.ఇక్కడ నివసించే కొన్ని అత్యంత ప్రమాదకరమైన కొన్ని జీవుల గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Amazon Rainforest Poison Dart Frog
ఈ కప్పలు భూమి మీద అత్యంత విషపూరితమైన జాతులలో ఒకటిగా పరిగణించబడతాయి. ఇవి చూడటానికి పసుపు, నారింజ, ఎరుపు, ఆకుపచ్చ వంటి ప్రకాశవంతమైన రంగులలో ఉంటాయి. ఇవి ఎంత విషపూరితమైనవి అంటే ఉదాహరణకు, బంగారు పాయిజన్ డార్ట్ కప్పలో 20,000 ఎలుకలను లేదా పూర్తిగా ఎదిగిన 20 మంది మనుషులను చంపడానికి తగినంత విషం కల్గి ఉంటుంది. పాయిజన్ డార్ట్ కప్పలు తినే కొన్ని కీటకాల నుండి విషాన్ని పొందుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ అమెజాన్ అడవులలో నివసించే స్థానిక జాతుల వారు, వాళ్ళయొక్క బాణాలకు ఈ కప్పల యొక్క విషాన్ని పూసి వేటాడతారు.
గ్రీన్ అనకొండను వాటర్ బోవా అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సర్పం. ఇవి సుమారు 10 సంవత్సరాల పాటు జీవిస్తాయి. ఇవి ఎక్కువగా యవ్వనంగా ఉండటానికి ఇష్టపడతాయి.
ఈ గ్రీన్ అనకొండలు సగటున 20 అడుగులు పొడవు కలిగి గరిష్టంగా 30 అడుగుల వరకు పెరుగుతాయి. వీటియొక్క బరువు సుమారుగా 227 కిలోల వరకు ఉంటాయి. బరువుపరంగా ఇవి పెద్ద అనకొండలైనప్పటికీ భూమిపై పొడవైన పాము మాత్రం రెటిక్యులేటెడ్ పైథాన్.
ఇవి గర్భవతి అయిన తర్వాత ఆడది తన శరీరం లోపల గుడ్లనుఉత్పత్తి చేస్తుంది. ఈ గుడ్లు 8-12 వారాల పాటు వృద్ధి చెందుతాయి. ఇంకోవిషయం ఏమిటంటే ఈ గుడ్లు తల్లి శరీరం లోపల ఉన్నప్పుడు పొదుగుతాయి. ఈ అనకొండలు సుమారుగా 80 చిన్న పాములకు జన్మనిస్తుంది, ఈ యొక్క పిల్లలు 12 నుంచి 24 అంగుళాల పొడవు వరకు ఉంటాయి.
అనకొండలు విషపూరితమైనవి కావు. ఇవి ఆహారాన్ని వేటాడేటప్పుడు, జంతువులను వాటి దవడలలో గట్టిగ పట్టుకుని, దంతాలతో లాక్ చేస్తుంది తరువాత ఆ జంతువు చుట్టూ గట్టిగా చుట్టుకుని ఊపిరాడకుండా చేసి చంపి తింటుంది. ఇవి ఒక పెద్ద జంతువును వేటాడిన తరువాత మళ్ళీ కొన్ని వారాల పాటు ఆహరం దొరక్క పోయిన జీవించగల్గుతుంది.
ఇవి వేట కోసం ఎక్కువసేపు నీటిలో గడుపుతాయి. ఇవి నీటిలో 10 నిమిషాల వరకు శ్వాసను బిగపట్టి ఉండకలవు. ఇవి నీటిలో ముసలి వలే, కళ్ళు నాసికా రంద్రాలు బయట ఉంచి మిగిలిన మొత్తం భాగాన్ని లోపల ఉంచి వేటాడగల్గుతుంది.
3. Amazon Rainforest Jaguar
దక్షిణ అమెరికాలోని పిల్లి జాతులలో జాగ్వార్స్ అతిపెద్దవి మరియు పులి, సింహం తరువాత ఇవి ప్రపంచంలో మూడవ అతిపెద్ద జాతి పిల్లులు. మనకు అమెజాన్ నదీ పరీవాహక ప్రాంతంలో చాలా జాగ్వార్‌లు కనిపిస్తాయి.
జాగ్వార్ అనే పేరు స్థానిక అమెరికన్ పదం 'యాగ్వార్' నుండి వచ్చింది, దీని అర్థం ‘ఒక దుముకులో/గంతులో చంపేవాడు’.
ఇవి ఎక్కువగా ఒంటరిగా నివసిస్తాయి. ఇవి కేవలం సంభోగం సమయంలో మాత్రమే ఒకదానికొకటి దగ్గరగా వస్తాయి. జాగ్వార్స్ దట్టమైన అడవిలో 12 నుండి 15 సంవత్సరాల వరకు బ్రతుకుతాయి, బందిఖానాలో ఇవి 20 సంవత్సరాల వరకు జీవించగలవు. మగ జాగ్వార్స్ ఆడవాటి కంటే 10-20% పెద్దవిగా ఉంటాయి. సగటున జాగ్వార్ల బరువు 56–113 కిలోలు ఉండి 4 నుండి 6.5 అడుగుల వరకు పొడవు ఉంటాయి. జాగ్వార్స్ పగలు మరియు రాత్రి పూట కూడా వేటాడగల్గుతాయి. జాగ్వార్ దవడ చాలా శక్తివంతమైంది, దీని వేటు సింహం కంటే ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. వీటియొక్క దవడలు సముద్ర తాబేలు షెల్ ను పగులగొట్టేంత బలంగా ఉంటాయి.
4. . Amazonian Giant Centipede
అమెజోనియన్ సెంటిపైడ్ (జెర్రి) ప్రపంచంలో అతిపెద్ద జెర్రి జాతులలో ఒకటి. ఇవి చూడటానికి చాలా పెద్దవిగా కనిపిస్తాయి. ఈ జెర్రి చాలా ప్రమాదకరమైనది, ఇవి 12 అంగుళాల పొడవు వరకు పెరుగుతాయి. ఇవి వేటాడటానికి ఒక ప్రత్యేకమైన బ్యాట్-హంటింగ్ టెక్నిక్ కలదు.
ఆసక్తికర విషయమేమిటంటే, ఇవి దానికంటే పరిమాణంలో పెద్దవైన బల్లులు, పాములు, కప్పలు, ఎలుకలు, గబ్బిలాలు మరియు పిచ్చుక వంటి పక్షులను కూడా చంపి ఆహారంగా తీసుకుంటుంది. ఆశ్చర్యగొలిపే విషయం ఏమిటంటే వీటికి కళ్ళు కనిపించవు. ఇవి స్పర్శను మరియు వాసనను బట్టి ఇతర జీవులను చంపి ఆహారంగా తీసుకుంటాయి.
ఈ జెర్రి చాలా విషపూరితమైనవి. ఇవి మనుషులను కరిచినప్పుడు తీవ్రమైన నొప్పి, అలసట, చలి మరియు వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. సరైన వైద్యం అందకపోతే ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది.
5. Amazon Rainforest Brazilian Wandering Spider
6. Amazon Rainforest Bullet Ant
బుల్లెట్ చీమ ప్రపంచంలోనే అతిపెద్ద చీమల జాతిగా పరిగణించబడుతుంది. బుల్లెట్ చీమ యొక్క సగటు పరిమాణం 0.7 నుంచి 1.2 అంగుళాల పొడవు వరకు ఉంటుంది. సాధారణంగా చీమలలో రాణి చీమ చాలా పెద్దదిగా ఉంటుంది కానీ దానికి భిన్నంగా బుల్లెట్ చీమల యొక్క రాణి కార్మిక చీమల కంటే చిన్నగా ఉంటుంది. వీటి యొక్క నివాసాలు చెట్టు అడుగుభాగానా కనిపిస్తాయి.
ఈ బుల్లెట్ చీమలు కరిచినప్పుడు దానియొక్క నొప్పి 24 గంటలకు పైగా ఉంటుంది. బుల్లెట్ చీమ నుండి వచ్చే స్టింగ్‌ను తుపాకీ కాల్పుల నుండి వచ్చే స్టింగ్‌తో పోల్చుతారు. అమెజాన్ అడవులలో నివసించే కొన్ని స్థానిక తెగలలో ఒక విచిత్రమైన సంప్రదాయం ఉంది అదేమిటంటే ఆ తెగలలో మగపిల్లలు యోధులుగా పరిగణించబడాలంటే ఈ చీమలు నింపిన తొడుగును బాలుడు చేతికి తొడుగుతారు అప్పుడు అతన్ని చీమలు కరుస్తున్నపుడు ఆ భాదను భరిస్తే అతనిని యోధుడుగా గుర్తిస్తారు.
7. Lance Head Pit Viper
ఇది బ్రెజిల్ లోని ఒక చిన్న ద్వీపానికి చెందిన విషపూరిత పిట్ వైపర్ జాతులలో ఒకటి. అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ లాన్స్ హెడ్ పిట్ వైపర్ వంటి వాటికి నిలయం. ఇక్కడ ఇవి చాలా పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి.
8 Assassin Bug
దీనిని Kissing Bug అని కూడా పిలుస్తారు, ఇది చాలా ప్రమాదకరమైన దోమ. ఇవి కుడితే చాలా బాధాకరంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా మనుషుల మొహం పైన పెదాల మీద కుడుతుంది అందువల్లనే వీటికి Kissing Bug అని పేరు వచ్చింది.






















0 comments
Post a Comment