దక్షిణ అమెరికా ఖండంలోని అమెజాన్ rainforest గురించి అందరికి తెలిసిందే. ఇది సుమారుగా 1500 రకాల పక్షి జాతులకు ఆవాసం కల్పిస్తున్నది. ప్రపంచంలో కనిపించే అన్ని రకాల పక్షులలో మూడింట ఒక వంతు పక్షిజాతులు ఇక్కడ నివసిస్తున్నాయి. ఈ యొక్క అమెజాన్ అడవులలో నివసించే పక్షిజాతులలో Macaw's కు ప్రత్యేక స్థానం కలదు.
Macaw's చూడటానికి చాలా అందంగా రంగు రంగుల ఈకలను కలిగి అమెజాన్ అడవులలో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇవి చిలుక జాతికి చెందిన పక్షులు. ప్రపంచవ్యాప్తంగా 376 రకాల చిలుక జాతులు కలవు అందులో Macaw 's అనేవి చాలా పెద్దవి. ఇవి చాలా తెలివిగల పక్షులు.
దక్షిణ మరియు మధ్య అమెరికా అరణ్యాలలో కనీసం 17 వేర్వేరు రకాల Macaw's జాతులు నివసిస్తున్నాయి. ఈ Macaw's నీలం, బంగారు ఛాయ, ఆకుపచ్చ, ఎరుపు వివిధ మిశ్రమ రంగులను కలిగి ఉంటాయి. అలానే వీటి యొక్క అరుపులు amazon rainforest మొత్తం వినిపిస్తూనే ఉంటాయి. వీటి యొక్క బరువు సుమారుగా 1KG నుండి 2KG వరకు కలిగి ఉంటాయి. అన్ని మాకావ్‌లలో అతి పెద్దది హైసింత్ మాకా, ఇది తల నుండి తోక వరకు 3.3 అడుగుల పొడవు మరియు రెక్కల విప్పితే సుమారు 5 అడుగుల వరకు ఉంటాయి.
సాధారణంగా అమెజాన్ Rainforest లో నివసించే మకావ్స్ పండ్లు, కాయలు, విత్తనాలు, ఆకులు, పువ్వులు, కాండం మరియు కీటకాలతో సహా అన్ని రకాల ఆహార పదార్దాలు తీసుకుంటాయి. అమెజాన్ బేసిన్లో కొన్ని మకావ్స్ నది ఒడ్డున ఉన్నటువంటి మట్టిని కూడా తింటాయి.
ఈ మకావ్స్ తల పైన ఉండే ఈకలు మన చేతి వేలిముద్రలవలె ప్రత్యేకంగా ఉంటాయి. ఇవి పొడవాటి కాళ్ళను మరియు పదునైన పంజాలను కలిగి ఉంటాయి. ఇవి చెట్ల కొమ్మలపై పట్టు నిలుపుకోవడానికి మరియు వస్తువులను పరిశీలించడానికి ఉపయోగిస్తాయి. ఇంకా వీటియొక్క పదునైన ముక్కును మూడవ పాదంగా ఉపయోగిస్తాయి.
ఇవి 3 నుండి 4 సంవత్సరాల వయస్సులో యవ్వన దశకు చేరుకుంటాయి. అప్పుడు ఇవి ఒక భాగస్వామిని ఎంచుకుని జీవితాంతం దానితోనే కలిసి ఉంటాయి. ఇంకొక విషయం ఏమిటంటే ఈ మకావ్ జంటలు కేవలం సంతానోత్పత్తి కోసం మాత్రమే కలిసి ఉండకుండా ఆహారం మరియు వాటి పిల్లలను సంరక్షించుకోవడంలో కూడా ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తాయి. ఈ శృంగార చిలుకలు ఎప్పుడు ఒకదానికొకటి దగ్గరగా దాదాపుగా హత్తుకున్నట్లుగా కనిపిస్తాయి. ఇవి ఒకదానినొకటి ఎపుడు విడిచిపెట్టి ఉండవు దాదాపుగా కలిసే ఉంటాయి.
Macaws are long lived birds
అమెజాన్ అడవిలో నివసించే మకావ్స్ సగటున 60 సంవత్సరాలు జీవిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇవి 80 నుండి 100 సంవత్సరాల వరకు జీవిస్తాయి. వీటిని ఎవరైనా పెంచుకున్నప్పుడు, ఆ యజమానుల కంటే ఎక్కువకాలం బ్రతికుంటాయి. చార్లీ అనే ఆడ నీలం మరియు బంగారు ఛాయ కల్గిన మకావ్ 112 వత్సరాలు జీవించినట్లు తెలిసింది.
మకావ్స్ జనవరి నుండి ఏప్రిల్ మధ్య కాలంలో ఎండిపోయిన చెట్ల మధ్య ఉన్నటువంటి రంధ్రాలలో గూడు కట్టుకుంటాయి. ఇవి విజయవంతంగా సంభోగం చేసిన తరువాత రెండు లేదా మూడు గుడ్లు మాత్రమే పెడతాయి. ఇవి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే గుడ్లు పెడతాయి.
మొత్తం 22 జాతుల మకావ్స్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో, ఐదు జాతులు అంతరించిపోయాయి. మూడు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాయి (హైసింత్ మకావ్స్, రెడ్-ఫ్రంటెడ్ మకావ్స్ మరియు బ్లూ-థ్రోటెడ్ మకావ్స్), నాలుగు ప్రమాద జాబితా లో చేర్చబడ్డాయి, అలానే మిగిలిన వాటికి కూడా ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అడవుల నిర్మూలన వల్లన చాలా రకాల పక్షి జాతులు అంతరించి పోతాయని మేధావులు ఆందోళన చెందుతున్నారు.
మీరు కూడా మనలో భాగమైన పక్షి జాతులు అంతరించి పోకుండా మీ వంతు సాయం చేయగలరని మనవి చేసుకుంటున్నాను.



















0 comments
Post a Comment